నా మెజారిటీని తగ్గించేందుకు దోపిడీ సొమ్ము పంచుతున్నారు: నారా లోకేశ్ - Nara Lokesh Rachabanda Program
🎬 Watch Now: Feature Video
Nara Lokesh Rachabanda Program in Mangalagiri : గుంటూరు జిల్లా మంగళగిరిలో తన మెజార్టీ తగ్గించేందుకు సీఎం జగన్ రూ. 300 కోట్లు పంపించారని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ ఆరోపించారు. 'ఓటుకు రూ.10 వేలు ఇస్తారట. ఇదంతా మీ డబ్బే తీసుకోండి. కానీ నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు వచ్చిన నాకు ఓటేసి గెలిపించండి' అని కోరారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, మద్యం, పెట్రోల్, డీజిల్, ఇంటి, చెత్త పన్నుల పేరుతో జగన్ ఒక్కో కుటుంబం నుంచి సుమారు రూ.రెండున్నర లక్షలు కొట్టేశారని, అందులో పది శాతం సొమ్ము ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చానని, హామీలన్నీ నెరవేర్చి నియోజకవర్గ ప్రజలతో శభాష్ అనిపించుకుంటానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నిడమర్రిలో నిర్వహించిన రచ్చబండలో నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పాల్గొన్నారు.
Nara Lokesh ABout his Majority in Mangalagiri : రాష్ట్రంలో అందరికీ ఉపాధి లభించాలంటే టీడీపీ ద్వారానే సాధ్యమవుతుందని నారా లోకేశ్ చెప్పారు. అంతకు ముందు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 260 కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. ఉండవల్లి నివాసంలో లోకేశ్ సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నాయి.