ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వని వైఎస్సార్సీపీని ఓడిస్తాం : మందకృష్ణ మాదిగ - Manda Krishna Madiga Meeting - MANDA KRISHNA MADIGA MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 12:31 PM IST
Manda Krishna Madiga Meeting in NTR District : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న కూటమికే మాదిగల మద్దతు ఉంటుందని మందకృష్ణ మాదిగ తెలిపారు. నరసరావుపేటలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు ఏ మాత్రం మద్దతు ఇవ్వని వైఎస్సార్సీపీకి ఎట్టి పరిస్థితుల్లో తమ ఆదరణ ఉండదన్నారు. వైఎస్సార్సీపీని ఓడించాలనే సందేశంతో జనంలోకి వెళ్తామని ఎమ్మార్పీఎస్ (MRPS) ఆధ్వర్యంలో మాదిగలు నినదించారు. మాదిగల భవిష్యత్ తరాల బాగు కోసమే కూటమికి ఈ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు అని మందకృష్ణ తెలిపారు.
ఈ సందర్బంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రతి ఏటా కేటాయించి వారిపైనే పూర్తిగా ఖర్చు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను పునః ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.