మద్యం మత్తులో రెండు భవనాల మధ్య ఇరుక్కున్న వ్యక్తి- స్థానికులు గమనించేలోగా ఘోరం - ఇళ్ల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 2:53 PM IST

Updated : Feb 9, 2024, 7:33 PM IST

Man Lost his Life Stuck between Two Houses Due to Alcohol Consumption: కుటుంబాన్ని కోల్పోయి, తాగుడుకు బానిసయ్యాడు ఓ వ్యక్తి. ఆ మద్యం మత్తులో ఎం చేస్తున్నాడో విషయం గ్రహించక రెండు భవనాల మధ్య ఇరుక్కుపోయి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం చింతా వారి వీధిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గీదా శివ సుబ్రహ్మణ్యం (38) యానంలో నివాసం ఉంటున్నాడు. కుటుంబాన్ని కోల్పోవటంతో ఉపాధి మానేసి కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి మద్యం సేవించి ఉన్న మృతుడు సుబ్రహ్మణ్యం ప్రమాదవశాత్తు  పిట్టగోడపై నుంచి రెండు బిల్డింగుల మధ్యలో పడిపోయాడు. ఈ క్రమంలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఉదయం పక్కింటి వారు గమనించి పోలీసులకి సమాచారం అందించంతో ఘటనా స్థలానికి యానాం పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని అతికష్టం మీద భవనం పైకి లాగి మృతుని వివరాల సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Feb 9, 2024, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.