ఇదేందయ్యా ఇది - మందులో ఫ్రీ స్టఫ్ ఇవ్వలేదని మరీ ఇంత వైలెంట్​​గా బిహేవ్ చేస్తారా? - Drunker attack on permit room Owner

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 2:07 PM IST

thumbnail
ఇదేందయ్యా ఇది - ఫ్రీ స్టఫ్ కోసం మరీ ఇంత వైలెంట్​​గా బిహేవ్ చేస్తారా? (Man Attacks on Permit Room Owner)

Man Attacks on Permit Room Owner For Free Stuff : మందుబాబుల వైఖరి మితిమీరిపోతుంది అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. ఫ్రీ స్టఫ్ కోసం ఏకంగా వైన్​షాప్ నిర్వాహకుడిపై దాడికి పాల్పడ్డారు ఇద్దరు అగంతకులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. 

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ వైన్స్ షాప్ ఉంది. అక్కడే పర్మిట్ రూమ్​లో మద్యం సేవించేందుకు ఇద్దరు వచ్చారు. అందులో ఒక వ్యక్తి నిర్వాహకుడి దగ్గరకు వచ్చి ఫ్రీగా స్టఫ్ ఇవ్వాలని అడగ్గా అందుకు నిర్వాహకుడు స్టఫ్ కావాలంటే డబ్బులు కట్టాలి అన్నాడు. కోపానికి గురైన అతను నిర్వాహకుడిపై దాడికి దిగాడు. 'స్థానికులం మమ్మల్నే డబ్బులు అడుగుతావా' అంటూ చితకబాదాడు. అతనితో వచ్చిన వ్యక్తి సైతం కత్తితో బెదిరించి నిర్వాహకుడి ఫోన్ పగలకొట్టారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కత్తితో దాడికి యత్నించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.