మద్యంపై యుద్ధం పేరుతో జనవరి 31న విజయవాడలో మహాధర్నా- ఏపీ మహిళా సమాఖ్య పిలుపు - మద్యంపై యుద్ధం విజయవాడలో మహాధర్నా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 3:47 PM IST
Mahila Samakhya Against Liquor in Vijayawada : 'మద్యంపై యుద్ధం' పేరుతో జనవరి 31వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గా భవాని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుర్గాభవాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు.
మద్యం కారణంగా 70% కుటుంబాలు తీవ్ర దుర్భిక్షం పాలవడంతో మద్యంపై యుద్ధం కొనసాగింపుగా 31న మహాధర్నాను జయప్రదం చేయాలని పెన్మత్స దుర్గా భవాని పిలుపునిచ్చారు. సమాజంలో హింసతో పాటు నేర ప్రవృత్తి పెరుగుతోందన్నారు. దీనికి కారణం మద్యం అని ధ్వజమెత్తారు. దీని వల్ల కుటుంబంలో మహిళలు అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. మధ్య నిషేధం కోసం తామి నినదిస్తున్నామన్నారు. తక్షణమే మద్యపానం నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.