కూటమి గెలుపునకు కృషి చేస్తాం- మందకృష్ణ మాదిగ - Madiga Manda krishna - MADIGA MANDA KRISHNA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 7:03 PM IST
Madiga Manda krishna about Alliance Victory: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి (NDA Alliance) అభ్యర్థులకు మద్దతుగా నిలిచి వచ్చే ఎన్నికల్లో వారి గెలుపు కోసం కృషి చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
Manda krishna Said Support Alliance for Better Future: ఈ సమావేశానికి హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడుతుందని మందకృష్ణ తెలిపారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడుతుందని, అదే కూటమికి ఓటేస్తే జాతి బిడ్డల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని మందకృష్ణ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసేలా జరగబోయే ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ శ్రేణులు పని చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.