మా భూములు ఆక్రమించి మాపైనే కేసులు పెట్టారు: పెద్దిరెడ్డి బాధితుల ఆవేదన - PEDDIREDDY VICTIMS - PEDDIREDDY VICTIMS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 1:33 PM IST
Madanapalle Victims Complaint on YSRCP Leaders Land Grabbing : మదనపల్లె రెవెన్యూ డివిజన్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల వల్ల ఇబ్బంది పడిన బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. పీలేరు, కలికిరి మండలాల నుంచి ఇవాళ బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
తమ భూములు లాక్కుని తమపైనే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు ఇవ్వాలని బెదిరించారు, ఇవ్వని వారిపై దాడులు కూడా చేశారని పేర్కొన్నారు. వారసత్వంగా వస్తున్న భూములకు నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని భయపెట్టారని తెలియజేశారు. కొంత మంది రైతుల నుంచి పొలాలను, కొబ్బరిచెట్లు లాక్కునేందుకు ప్రయత్నించారన్నారు. అలా కానీ పక్షంలో తమ భూముల పట్టాలను లాక్కుని తగలబెట్టారని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయారు. వారితో కొంత మంది అధికారులు కుమ్మక్కై తమల్ని పలు రకాలుగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.