మేకల కోసం వచ్చి ఉచ్చులో చిక్కిన చిరుత - Leopard Attack
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 7:47 PM IST
Leopard Trapped in Kurnool District: కర్నూలు జిల్లా గుడేకల్ కొండల్లో మేకల కోసం వచ్చిన చిరుత ఉచ్చులో చిక్కుకుంది. మేత కోసం వెళ్లిన మేకలు, కుక్కలపై చిరుత దాడి చేస్తుందని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. పులి సంచారం (Cheetah Migration)తో భయభ్రాంతులకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులిని పట్టుకునేందుకు ఉచ్చు ఏర్పాటు చేయగా అందులో చిరుత చిక్కుకుంది. ప్రస్తుతం చిరుతను బంధించిన అధికారులు అడవిలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Leopard Attack on Farmer: కాగా ఇటీవలే అనంతపురం జిల్లాలో ఓ రైతుపై చిరుత దాడి చేసింది. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి తన వ్యవసాయ పొలంలో వేరుశనగకు స్ప్రింక్లర్లు మారుస్తుండగా పక్కనే అటవీ ప్రాంతంలో ఉన్న చిరుత ఒక్కసారిగా వచ్చి దాడి చేసింది. అయితే ఈ ప్రమాదం నుంచి రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చిరుత సంచారంతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.