ఉచ్చులో చిక్కుకున్న చిరుత- సురక్షితంగా అడవిలో వదిలిన అధికారులు - కర్నూలు ఉచ్చులో చిక్కుకున్న చిరుత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 11:23 AM IST
Leopard Trapped in Karnool District : కర్నూలు జిల్లా గుడికల్ వద్ద మేకల కోసం వచ్చి ఉచ్చులో చిక్కుకున్న చిరుతను (Leopard) అటవీశాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు. అనంతరం సురక్షితంగా అడవిలోకి వదిలేశారు. గుడికల్ వద్ద కొండల్లో ఆహారం కోసం వెతుకుతూ చిరుత మేకల కొట్టంలోకి ప్రవేశించింది. మేకను చంపి ఈడ్చుకెల్తూ ఉచ్చులో చిక్కుకుంది. చిరుతను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రోజూ మందలోని మేకలను గుర్తుతెలియని జంతువులు (Animals) చంపుతున్నాయని పశువుల కాపర్లు కొండల్లో అక్కడక్కడా ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది.
చిరుతను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు (Forest officials) ఆత్మకూరు నుంచి రెస్క్యూ టీమ్‌ను (Rescue Team ) పిలిపించారు. సంఘటన స్థలానికి అటవీశాఖ, రెస్క్యూ టీమ్ చేరుకుని చిరుతను సమీపంలో సిద్ధంగా ఉంచిన బోనులోకి ఎక్కించాకు. చిరుతను చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.