పెద్దిరెడ్డి అక్రమాలలో జవాన్​ సైతం బాధితుడే - మూడో రోజూ వెల్లువెత్తిన ఫిర్యాదులు - Land victims by Peddyreddy - LAND VICTIMS BY PEDDYREDDY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 3:28 PM IST

Land Victims by Peddyreddy At Madanapalle sub-collectorate 3rd Day : మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌కి మూడో రోజూ భూ బాధితులు పోటెత్తారు. వైఎస్సార్సీపీ హయాంలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు భారీగా తరలివచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు బెదిరింపులతో తమ భూములు లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ భూములు తిరిగి తమకు ఇప్పించాలని అధికారులను కోరారు.

ఇప్పటికే తాను చేసిన భూ దందాలు, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పెద్దిరెడ్డి అనుచరులు సబ్​ కలెక్టరేట్​కు నిప్పంటించారని ఆరోపణలున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు చేసిన భూదోపిడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో ఆర్మీ ఉద్యోగి ఉన్నారు. దేశాన్ని రక్షించే నేను వైఎస్సార్సీపీ నాయకుల అక్రమాలకు బాధితుడయ్యానని అతను వాపోయారు. తమ భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని పలువురు మండిపడ్డారు. అధికారులు తమ భూములు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.