'ల్యాండ్ టైటిల్ చట్టం వల్ల పేదలు భూములు కోల్పోయే పరిస్థితి- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - AP Land Titling Act
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 7:39 PM IST
Land Expert Sunil Interview About AP Land Titling Act : తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ల్యాండ్ టైటిల్ చట్టం ఎంత మంచి చేస్తుందో, అంత చెడు కూడా చేస్తుందని భూ చట్టాల నిపుణులు సునీల్ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రతిపాదిత చట్టంలో పొందుపరిచిన అంశాలు, అందులో ఉన్న లోపాలను వివరించారు. చట్టంలోని అభ్యంతరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఐదు నెలల క్రితమే ప్రజలకు సూచించినట్లు గుర్తుచేశారు.
ఒక్కసారి ఈ టైటిల్ రిజిస్టార్లో పేరు నమోదైన తర్వాత ఏవైన అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపల పరిష్కరించుకోవాలి. ఒకవేళ రెండు సంవత్సరాల లోపల ఆ సమస్య పరిష్కరం కాకపోతే ఇంకా ఎప్పటికి సమస్య పరిష్కారం కాదని తెలిపారు. అదే ఈ రోజున ఉన్న వ్యవస్థ ప్రకారం 30 సంవత్సరాల తర్వాత కూడా తప్పుని సరిచేసుకోవచ్చని వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ చట్టం అమలులోకి వస్తే ఆ వెసులుబాటు ఉండదన్నారు. అలాగే రికార్డులన్ని కేవలం కంప్యూటర్లోనే ఉంటాయి. ఎక్కడ కూడా పేపర్ విధానం ఉండదని తెలిపారు. ఈ చట్టం అమలులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పేదలకు, చిన్నకారు రైతులకు ఎక్కవ నష్టం జరిగి వారు భూములు కొల్పోయే పరిస్థితి వస్తుందని సునీల్ వెల్లడించారు.