తారు డ్రమ్ములో ఇరుక్కుపోయిన కూలీ- రెండు రోజులుగా అందులోనే - తారు డబ్బాలో ఇరుక్కున కూలీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:17 PM IST
|Updated : Feb 7, 2024, 12:35 PM IST
Labour From Bihar Accidentally Slipped in Tar Bin: ప్రమాదవశాత్తు తారు డ్రమ్ములో పడి రెండు రోజులు నరకయాతన అనుభవించిన కార్మికుడిని మంగళవారం పోలీసులు అతి కష్టం మీద బయటకు తీశారు. స్వల్ప గాయాలైన కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Labour Stuck In Tar Bin: విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడు వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి. బిహార్‌కు చెందిన కార్మికుడు అక్కడ పని చేస్తూ సోమవారం ప్రమాదవశాత్తు తారు డ్రమ్ములో జారి పడిపోయాడు. ఈ విషయాన్ని అక్కడున్నవారు ఎవరూ గమనించకపోవటంతో తారు డ్రమ్ములో ఉండిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం బాధితుడి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో అతి కష్టంపై కార్మికుడిని తారు డ్రమ్ములో నుంచి బయటకు తీశారు. శరీరం స్వల్పంగా కాలటంతో బాధితుడిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.