రాష్ట్రంలో దాడుల వెనుక కుట్ర కోణం- కౌెంటింగ్కు భారీ భద్రత ఏర్పాటు చేయాలి : కనకమేడల - Kanakamedala Ravindra - KANAKAMEDALA RAVINDRA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/640-480-21522566-539-21522566-1716290615104.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 3:56 PM IST
|Updated : May 21, 2024, 4:54 PM IST
Kanakamedala Ravindra Kumar on Macherla Incident : మాచర్లలో తెలుగుదేశం కార్యకర్త గొంతు కోసి నడిరోడ్డుపై చంపారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు జరిగాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కేసులు పెట్టలేదని కనకమేడల ఆరోపించారు. తప్పనిసరి కేసులు నమోదు చేయాల్సి వస్తే నామమాత్రపు కేసులుపెట్టారని ఆక్షేపించారు. సీఎస్ జవహర్ రెడ్డి, అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటిలిజెన్స్ అధికారి సీతారామాంజనేయులు కనుసన్నల్లో దాడులు జరిగాయన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టి కటకటాల్లోకి పంపాలని డిమాండ్ చేశారు.
4వ తేదీన జరిగే కౌంటింగ్ సమయంలో సైతం పూర్తి స్థాయిలో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని కనకమేడల డిమాండ్ చేశారు. అందు కోసం కేంద్ర బలగాలతో భద్రత చర్యలను చేపట్టాలని పేర్కొన్నారు. దాడులపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడుల వెనుక కుట్రకోణం దాగుందని కనకమేడల ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిపై, అట్రాసిటి కేసులు నమోదు చేయలేదని, 320 సెక్షన్లు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారని కనకమేడల ఆరోపించారు.