91వేల కోట్ల అప్పు లెక్కలేవీ? - నిధుల దుర్వినియోగంపై కాగ్ విచారణ చేయాలి : నాదెండ్ల - Nadendla Manohar Fire on Government

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 5:07 PM IST

Janasena Leader Nadendla Manohar Fire on Government : రివర్స్ బారోయింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లెక్కతేలని అప్పులు చేసిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆర్థిక శాఖ ద్వారా తెచ్చిన 1.72 లక్షల కోట్ల అప్పులతోపాటూ ప్రభుత్వం అదనంగా 91వేల 253 కోట్లు అప్పు చేసిందని, దీనికి లెక్కలు తేలడం లేదని మనోహర్ నొక్కిచెప్పారు. ఈ డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదని, ఈ లెక్కలపై బహిరంగంగా చర్చించడానికి జనసేన సిద్ధంగా ఉందని, చర్చించేందుకు రావాలని మనోహర్ వైఎస్సార్సీపీ నేతలకు సవాల్ విసిరారు. ఈ నిధుల దుర్వినియోగంపై కాగ్ విచారణ జరిపించాలని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి సమగ్ర విచారణ జరిపించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హోటల్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయవాడ నగర జనసేన అధ్యక్షుడు పోతిన మహేశ్​తోపాటు నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

భీమిలి సభలో చంద్రబాబు, పవన్ కటౌట్లు ఏర్పాటుచేసి కిక్ బ్యాగ్స్‌తో కొట్టించడం ద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందారని ధ్వజమెత్తారు.  ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేయడం సబబు కాదని, చరిత్రలో సంస్కారం లేని వ్యక్తిగా జగన్ మిగిలిపోనున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఖర్చులతో సభ పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.