టీడీఆర్‌ కుంభకోణంలో వైసీపీ అభ్యర్థి భూమన ప్రధాన సూత్రధారి: జనసేన నేత కీర్తన - Janasena leader Kirtana - JANASENA LEADER KIRTANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 8:46 AM IST

Janasena Leader Kirtana Comment on TDR Bonds Scam : వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుపతిలో అభివృద్థి పేరుతో అవినీతి జరిగిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన ఆరోపించారు. రోడ్ల అభివృద్ధి వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందన్నారు. టీడీఆర్​ బాండ్ల పేరుతో భూమన కుటుంబ సభ్యులు వందల కోట్లు దోచేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో వైసీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీఆర్​ బాండ్ల కుంభకోణంపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.

టీడీఆర్​ బాండ్ల స్కామ్​పై వైసీపీ అభ్యర్థి అభినయ్​రెడ్డి బహిరంగ చర్చకు రావాలని కీర్తన డిమాండ్​ చేశారు. బాండ్ల పేరుతో భారీ స్కామ్​కు అభినయ్​​రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున స్థలాలు ఆక్రమించారని ధ్వజమెత్తారు. అభినయ్​రెడ్డి ఎలాంటి తప్పలేదని నిరూపించుకోవడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని పేర్కొన్నారు. టీడీఆర్​ బాండ్ల స్కామ్​లో అభినయ్​రెడ్డి బంధువు వర్గం వల్లే అని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.