LIVE: భీమవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - భీమవరంలో జనసేనాని

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 3:44 PM IST

Updated : Feb 21, 2024, 4:07 PM IST

LIVE : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్నారు. మంగళవారం రెండవరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగిసింది. నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేనాని పర్యటన చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరం చేరుకున్నారు. పెదఅమిరంలో జనసేన, టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు.

ప్రజల్లో జనసేనపై అభిమానం ఉందని దాన్ని ఓటుగా మార్చేందుకు ఈ క్షణం నుంచే పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పవన్‌కల్యాణ్‌ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అంతా ఐక్యంగా ముందుకెళ్లాలని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. అప్రజాస్వామిక, ఫ్యాక్షన్‌ ధోరణితో వెళ్తున్న సీఎం జగన్‌ను అడ్డుకోవాలంటే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంగళవారం తూర్పుగోదావరి జిల్లా నేతలకు స్పష్టం చేశారు. 

సమర్థ ఎలక్షనీరింగ్‌ చేసే అభ్యర్థులు ఉండాలని ఎక్కువ స్థానాలు డిమాండ్‌ చేసి తీసుకుని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వైసీపీకి లబ్ధి చేకూరుతుందని నేతలకు వివరించారు. మరో దఫా వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అస్తవ్యస్తమవుతుందన్న పవన్‌ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని ఓట్ల బదిలీ కచ్చితంగా జరగాలని సూచించారు.

 భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన ప్రత్యక్ష ప్రసారం మీ కోసం

Last Updated : Feb 21, 2024, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.