వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే లేదు: జనచైతన్య వేదిక - YSRCP Manifesto - YSRCP MANIFESTO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-04-2024/640-480-21337078-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 5:26 PM IST
YSRCP Manifesto: అభివృద్ధి ఊసే లేకుండా ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగకుండా, సంపద సృష్టించకుండా, ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి సంక్షేమం అందించడం సరికాదన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని, ఆచరణలో మద్యం అమ్మకాలను 1.5 లక్షల కోట్లకు చేర్చారని మండిపడ్డారు.
వైసీపీ ప్రకటించిన నూతన మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావన లేకపోవడం శోచనీయమని వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. విద్యావంతులలో 25 శాతం మంది రాష్ట్ర యువత నిరుద్యోగులుగా ఉన్నారని , ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి, అవస్థాపన సౌకర్యాల మెరుగుదలకు మేనిఫెస్టోలో స్థానం కల్పించలేదన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో పంచాయితీల ప్రగతికి సంబంధించిన ప్రస్తావన లేదని అఖిల భారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు.