పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన - International Experts on Polavaram - INTERNATIONAL EXPERTS ON POLAVARAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 9:57 PM IST
International Water Resources Experts visit Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడాల నుంచి వచ్చిన నలుగురు నిపుణులు శనివారమే దిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం వచ్చి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ అధికారులతో భేటీ నిర్వహించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ పరిశీలన చేపట్టారు. తొలి రెండు రోజులు డయాఫ్రం వాల్, రెండు కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్ల పరిశీలన కొనసాగనుంది. ప్రాజెక్టు డిజైన్ల మొదలు ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల తర్వాత కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర నిపుణులతో మేధోమథనం చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం జలసంఘం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది.