బాధితులందరికీ అండగా ఉంటా - ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నేను కూడా ఉన్నాను: బ్రహ్మారెడ్డి - palnadu district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 11:56 AM IST
Internal Meeting of YCP disaffected Leaders in Palnadu District : ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల నష్టపోయిన బాధితులందరికీ తాను అండగా ఉంటానని, వారు తన వద్దకు వస్తే అధిష్ఠానంతో మాట్లాడి న్యాయం చేయిస్తానని గజ్జల బ్రహ్మారెడ్డి హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంలో శుక్రవారం వైసీపీ అసంతృప్తులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఏకం చేస్తున్నారు. శాసన సభ నియోజక వర్గ అభ్యర్థిత్వం ఎవరికనేది ఇంకా సృష్టత రాలేదన్నారు. తాను కూడా టికెట్ రేసులో ఉన్నానన్నారు.
అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే నరసరావుపేట అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. నియోజక వర్గం అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలని ఇంకా ఆలోచిస్తూనే ఉందని తెలియజేశారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ హానీఫ్, నాయకులు చల్లా శ్రీనివాసరావు, రవీంద్రా రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.