ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షురూ- కనీస వసతలు కరువు, ఉక్కపోత ఎండలో పరీక్షలు రాసిన విద్యార్థులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 12:26 PM IST
Inter Board Exams Started in Andhra Pradesh : రాష్ట్రవాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు (Intermediate Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిల ఆ పరిస్థితులు కనిపించ లేదు. మొదటి రోజు కావటంతో తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపారు. గుంటూరు జిల్లాలో 92, పల్నాడు జిల్లాలో 48, బాపట్ల జిల్లాలో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో సమయానికి విద్యార్థులు హడావిడిగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో, ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబీయం కళాశాలలో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వైయస్సార్ జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.
Inter Students Problems To Write Board Exams in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ (Govt Jr Collage) కళాశాల విద్యార్థులు ఎండకు మండుతూ ఇబ్బందులు పడుతూ ఇంటర్ పరీక్షలు రాశారు. అధికారులు విద్యార్థులను పాఠశాల ఆవరణలోని షెడ్డులో కూర్చోబెట్టి పరీక్షలు రాయించారు. షెడ్డులో ఎండ వేడిమి భరిచలేక పరీక్ష రాయలేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటర్ పరీక్షలు ఎండలో కూర్చోబెట్టి రాయిస్తున్నారని, కళాశాలలో కనీస వసతులు లేవని విద్యార్థులు (Students) వాపోయారు. ఎండలో పరీక్షలు రాయించడం ఏంటిని కనీస సౌకర్యాలు కల్పించలేని కళాశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.