'చంద్రబాబుపై కక్షపూరితంగానే కేసులు'- ఐఆర్ఆర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ - సీనియర్ న్యాయవాది రాజేంద్రప్రసాద్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 5:40 PM IST
Inner Ring Road Case is a Hard Setback for the State Government : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై ఎస్ఎల్పీ దాఖలైందని సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ కేసులో కూడా 17 ఏ నిబంధన వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించిందిందని తెలిపారు.
చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సెక్షన్ 420 వర్తించదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పిందని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరమూ లేదని ధర్మాసనం సృష్టం చేసిన విషయాన్ని వెల్లడించారు. అన్ని వివరాలు పరిశీలించిన ధర్మాసనం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైందని కదా అని తెలిపినట్లు పేర్కొన్నారు. సహనిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయటే ఉంటే నష్టమేంటని ధర్నాసనం ప్రశ్నించినట్లు తెలియజేశారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కక్షపూరితంగానే కేసులు పెడుతుందని రాజేంద్రప్రసాద్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.