విశాఖకు టీసీఎస్ ఒక 'గేమ్ ఛేంజర్' : నరేష్ కుమార్ - TCS IN VISHAKHA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2024/640-480-22669488-thumbnail-16x9-industrialist-o-naresh-kumar-interview.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2024, 1:19 PM IST
Industrialist O Naresh Kumar Interview : విశాఖలో టీసీఎస్ సంస్థ ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పిస్తే అదో పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని పరిశ్రమల వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. దీని వల్ల ఐటీ రంగంలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు మెరుగవడమే కాకుండా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరుగుతుందని రుషికొండ ఐటీ పరిశ్రమదారుల సంఘం ఉపాధ్యక్షుడు, సింబోయాసిస్ అధినేత ఓ.నరేష్ కుమార్ చెబుతున్నారు. 10 వేల మందికి ఉపాధి కల్పనతో విశాఖకు టీసీఎస్ రావడం శుభపరిణామని ఆనందం వ్యక్తం చేశారు. టీసీఎస్‌కు విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన సమస్య కాదని అన్నారు.
విశాఖకు టీసీఎస్ రాకతో స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని, పెద్ద నగరాలతో సమానంగా వేతనాలు ఉంటాయని ఓ.నరేష్ తెలిపారు. టీసీఎస్ రాకతో విశాఖలో అన్ని రంగాలు వృద్ధి చెందుతాయని, అదే విధంగా మరిన్ని పెద్ద సంస్థలు విశాఖకు తరలివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హైస్పీడ్ డేటా, కనెక్టివిటీ, నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాలని కోరినట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్న సదుపాయాల విస్తరణ ఏ దిశగా సాగాలన్న విషయంపై నరేష్‌తో ముఖాముఖి