కొనసాగుతున్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇసుక అక్రమాలు - YCP EX MP Sand Mafia - YCP EX MP SAND MAFIA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 3:39 PM IST

Illegal Transport of Sand by Followers of Former YCP ex MP Nandigam Suresh : గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో అక్రమంగా ఇసుకను దొచుకుతీన్న వైసీపీ నేతలు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుతీరీన అక్రమాలను మాత్రం ఆపడం లేదు. తాజగా వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేశ్ అనుచరుల అక్రమ ఇసుక రవాణా ఇప్పటికి కొనసాగుతుంది. విజయవాడ నగరం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా టీడీపీ శ్రేణులు ఆ వాహనాలను గుర్తించి అడ్డుకున్నారు. భవానిపురం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఓ కాటా వద్దకు ఆ ఇసుక లారీలు తీసుకొచ్చి, కాటా వేస్తుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వలపన్ని పట్టుకున్నారు.
Illegal Sand Mafia in Vijayawada : వెంటనే అప్రమత్తమైన డ్రైవర్లు లారీలోని ఇసుకను నడిరోడ్డు మీద డంప్‌ చేసి పరారయ్యేందుకు యత్నించారు. వారిని ఛేదించి సితారా సెంటర్ వద్ద టీడీపీ నాయకులు నిలువరించి పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అలాగే లారీలకు నెంబర్ ప్లేట్ లేకుండానే నడపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.