ఐఏఎస్ అధికారుల బదిలీ- మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్.తేజ్ భరత్ - IAS Officers Transfer in AP - IAS OFFICERS TRANSFER IN AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 8:39 AM IST
IAS Officers Transfer in AP : రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల చేసిన బదిలీల్లో ఒక మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా వి.అభిషేక్ ను నియమిచింది. పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రఖర్ జైన్‌ను నియమిస్తూ ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాహుల్ మీనాను బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జేసీగా శివ నారాయణశర్మను నియమించారు.
కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా జి.విద్యాధర్ నీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఆయనకే పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏటిపాక సబ్ కలెక్టర్‌గా అపూర్వ భరత్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చింతూరు ఐటీడీఏ పీఓగాను అపూర్వ భరత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.