thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 10:07 PM IST

ETV Bharat / Videos

రెండో పెళ్లికి అడ్డుపడిన భార్య - శిరోముండనం చేసిన భర్త

husband beheaded wife : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు భర్త శిరోముండనం చేశాడు. ఆపై భార్య జుట్టును చేత్తో పట్టుకుని చూపుతూ హల్‌చల్‌ చేశాడు. శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి భర్త అభిరామ్‌ అమానవీయంగా ప్రవర్తించాడు. భార్య ఆశపై అయిష్టతతోనే ఈ తతంగమంతా నడిపాడని తెలుస్తోంది. మరో పెళ్లికి సిద్ధమైన అభిరామ్‌, భార్య ఆశ ఊరికి వచ్చి ఆమెపై ఈ దాడికి పాల్పడడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

తన భార్యదే తప్పంటూ యువకుడు ఆరోపణలు చేస్తుండగా, రెండో పెళ్లి ఆశించి తనకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితురాలు ఆశ వాపోయింది. తన అత్తమామలు సైతం తన భర్తను సపోర్ట్ చేస్తున్నారంటూ రోదించింది. యువతికి శిరోముండనం చేసిన అభిరామ్​పై స్థానికులు మండిపడ్డారు. ఈ చర్యను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ అమానవీయ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిరామ్ యథేచ్ఛగా ఇంట్లోకి ప్రవేశించి ఆశపై ఈ దారుణానికి పాల్పడడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.