వినూత్నంగా 'హర్ ఘర్ తిరంగా' - 300 మంది స్కేటింగ్​ చేస్తూ కార్యక్రమం - 300 skaters in Har Ghar Tiranga - 300 SKATERS IN HAR GHAR TIRANGA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 12:34 PM IST

Har Ghar Tiranga Programme held with 300 skaters in visakha : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో జరిగిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని చేతపట్టిన చిన్నారులు స్కేటింగ్‌ చేశారు. సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కేటింగ్‌ రింగ్‌లో "హర్‌ ఘర్‌ తిరంగా" పాటకు లయబద్దంగా స్కేటింగ్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం క్రీడా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.

ఈ ఆగస్టు​ 15న నిర్వహించే 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందస్తు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మువ్వన్నెల జెండాలతో ముస్తాబయ్యాయి. పాఠశాలలు, కాళాశాలలో విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమర యోధులను గుర్తు చేసుకుని ప్రతీ ఏటా జరుపుకునే ఈ వేడుకకు సర్వం సిద్దమైంది. హర్​ ఘర్​​ తిరంగా కార్యక్రమంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్టీల్​ ప్లాంట్​ వద్ద జరిగిన కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.