రైతుల భూమి కాజేసిన ఎమ్మెల్యే- బాధితుల నిరసనకు టీడీపీ నేతల మద్దతు - Land Kabja by guntur Mla
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 3:48 PM IST
Guntur MLA Kilari Occupied Farmers Land : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో గత 40 ఏళ్లుగా 22 ఎకరాల భూమిలో పంటలు పండిస్తున్నామని రైతులు (Farmers) చెప్పారు. ఈ భూములను స్థానిక శాసనసభ్యులు కిలారి రోశయ్య (Kilari Rosaiah) అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. గతంలో ఈ భూములను కాజేసేందుకు ఎత్నించగా తామంతా న్యాయస్థానానికి వెళ్లి వాటిని కాపాడుకున్నామని నాయకులు చెప్పారు.
కొంతమంది తప్పుడు సంతకాలతో న్యాయస్థానానికి వెళ్లి ఎమ్మెల్యే ఆ పిటిషన్ కొట్టేయించుకున్నారన్నారు. దీంతో ఆ భూమిని అధికారులు డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీనోటిఫై ఉత్తర్వులు రాగానే ఎమ్మెల్యే తన ప్రధాన అనుచరుడు, పెదకాకాని శివాలయం చైర్మన్ అమ్మిశెట్టి శంకరరావు కుమారులు, కోడళ్ళ పేరుతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆన్లైన్లో ఎమ్మెల్యే (MLA) అనుచరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్త్రాలు కనిపించకుండా అధికారులు వాటిని దాచేశారని నాయకులు ఆరోపించారు. వాటిని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.