కర్నూలులో ముదిరిన వైఎస్సార్సీపీ వర్గపోరు - వ్యక్తి కిడ్నాప్ - group war in ycp leaders - GROUP WAR IN YCP LEADERS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 26, 2024, 7:34 PM IST
Group War in Kurnool YCP Leaders : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కర్నూలు వైఎస్సార్సీపీలో వర్గ పోరు తారా స్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హఫీజ్ ఖాన్ అనుచరులు తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని సయ్యద్ జిలాన్ షాహెబ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, బాధితుడు జిలాన్ కొన్ని నెలల క్రితం వరకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వద్ద పని చేశారు. తరువాత ఆయన నాయకత్వం నచ్చక అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ వద్ద చేరారు. దీంతో కోపోద్రిక్తుడైన హఫీజ్ ఖాన్ అతని అనుచరులతో తనను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. ఈరోజు 'నిన్ను చంపేస్తాం నీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫోన్ చేసుకో' అని బెదిరించారని బాధితుడు తెలిపారు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న హఫీజ్ ఖాన్ కలుగజేసుకొని ఇప్పుడు ఎన్నికల సమయమని, వదిలేద్దామని, లేదంటే మనమే ఇబ్బందులలో పడతామని స్థానిక దర్గా వద్ద వదిలిపెట్టి పోయారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.