ఆర్థిక లోటును తగ్గించాలంటే ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి: టాక్స్ పేయర్స్ - ఆర్థిక లోటును తిరస్కరించినప్రభుత్వం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 7:38 PM IST
Government Refusal to Compensate The Fiscal Deficit: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేయాలంటూ నాలుగో రాష్ట్ర ఆర్ధిక సంఘం చేసిన సీఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడంపై టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపే చర్యగా ఉందని అభివర్ణించారు. 2020-2025 ఆర్థిక లోటు పంచాయితీ రాజ్ సంస్థలకు రూ.26,975 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.13,568 కోట్ల రూపాయలు మొత్తం రూ.40,543 కోట్లుగా ఉండబోతున్నదని 4వ ఆర్ధిక సంఘం అంచనా వేసిందన్నారు.
ఆర్థిక లోటును తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం నుంచి పంచాయతీ రాజ్ సంస్థలకు 6.5శాతం చొప్పున, పట్టణ స్థానిక సంస్థలకు 3.26శాతం చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే ప్రభుత్వం దీన్ని తిరస్కరించడం దారుణమన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక లోటు వస్తుందన్నారు. ఈ లోటును తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఈ లోటును తగ్గించడానికి ప్రజలపై పన్నుల భారం వేస్తోందని విమర్శించారు.