సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు సానుకూల స్పందన: నిర్మాత ఎన్వీ ప్రసాద్​ - Govt Positive FilmIndustry Problems - GOVT POSITIVE FILMINDUSTRY PROBLEMS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:54 AM IST

Government Positive React to Solve Problems in Film Industry: సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా ఉండటం శుభపరిణామమన్నారు. గత ప్రభుత్వ హయంలో సినిమా పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంతో పోటీపడుతోందన్నారు. సినీ పరిశ్రమల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా అఖండ విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆయన చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిం చిన కల్కి చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ పరిశ్రమను వ్యాపారంగా చూడాలే కానీ రాజకీయ కోణంలో కక్షసాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని ప్రసాద్​ అన్నారు. పరిశ్రమ త్వరలో రాష్ట్రంలోకి తరలిరావడం ఖాయమన్నారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలను షూటింగ్ కేంద్రాలుగా మార్చుతామని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.