సూర్యనారాయణపై అక్రమ కేసులను ఎత్తివేయాలి- ఉద్యోగుల ధర్నా - government employees strike
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 4:07 PM IST
Government Employees Strike in Kurnool : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్ సూర్య నారాయణపై గత ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వం చేయని విధంగా గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘల నాయకులపై కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం సూర్య నారాయణపై అక్రమంగా మూడు కేసులు పెట్టిందని తెలిపారు.
ఇప్పటివరకు ఆ కేసులకు సరైన ఆధారాలు కూడా చూపలేక పోయారని విమర్శించారు. కేవలం కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. సూర్యనారాయణపై అక్రమ కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్ చేసి తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రోద్భలంతోనే ఈ అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలని బంగి శ్రీధర్ డిమాండ్ చేశారు.