అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలంటు కేశినేని చిన్నిని కలిసిన గొల్లపూడి రైతులు - Farmers Meet MP Kesineni Chinni - FARMERS MEET MP KESINENI CHINNI
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 7:54 PM IST
Farmers Meet MP Kesineni Chinni on Highway Problems : రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా నిర్మిస్తున్న హైవేపై గొల్లపూడి సహా పరిసర గ్రామాల ప్రజలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డులో అవసరమైన చోట్ల అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లు నిర్మించడం లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు పొలానికి వెళ్లేందుకు, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నట్లు ఎంపీకి వివరించారు. బైపాస్ రోడ్లపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించకపోవడం ప్రమాదమని ప్రజలు అంటున్నారు.
బైపాస్ నిర్మాణం జరుగుతున్న తీరు సహా తాము పడుతున్న ఇబ్బందులను మ్యాప్ ద్వారా ఎంపీకి వివరించారు. తాను స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని ఎంపీ చిన్ని తెలిపారు. రాజధాని ప్రాంతం కావడంతో వ్యవసాయ భూములను నివాస యోగ్యంగా మార్చేందుకు అవకాశం ఉంటుందని, సర్వీసు రోడ్లు నిర్మించకపోతే ప్రజలు నష్టపోయే పరిస్ధితి ఉందని రైతులు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటానని రైతులకు కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.