పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు - వ్యాపారి ఇంట్లో 50 తులాల బంగారం చోరీ - GOLD THEFTS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2024, 3:05 PM IST
Gold and Money Chori in Railway Koduru at Annamayya District : అన్నమయ్య జిల్లాలో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. రైల్వేకోడూరులో ఓ ఇంట్లో 50 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దోచుకున్నారు. మాచిరాజు కృష్ణంరాజు అనే వ్యాపారి ఇంట్లోకి దొంగలు చొరబడి బీరువాలో దాచిన సొత్తును చోరీ చేశారు. సోమవారం (అక్టోబర్ 7న) బాధితులు తిరుపతి ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి చూసేసరికి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. దీంతో అసలు విషయం గ్రహించి బాధితులు లబోదిబోమన్నారు.
Railway Koduru at Annamayya District : ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట సమయంలో చోరీ జరిగి ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఈ దొంగతనం జరగడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో బాధితులు రైల్వే కోడూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.