పోలింగ్ రోజు టీడీపీ బూత్ ఏజెంట్లతో వల్లభనేని వంశీ గొడవ - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో - Vallabhaneni Vamsi Poll violence - VALLABHANENI VAMSI POLL VIOLENCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 1:16 PM IST

Vallabhaneni Vamsi Try To Attack on TDP Leaders : పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నేతలు సృష్టించిన అల్లర్లు, ప్రతిపక్ష నేతలపై దాడులు చేసిన విషయం తెలిసింది. ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా గన్నవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ, ఆయన వర్గీయులు తెలుగుదేశం పార్టీ నేత ఇంటిపై దాడి చేసిన వీడియో బయటకు వచ్చింది.

పోలింగ్ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన వర్గీయులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అధికార పార్టీ కార్యకర్తలు, అనుచరులు సృష్టించిన వీరంగం  వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసరిపల్లి పోలింగ్ బూత్ వద్ద  వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ బూత్ ఏజంట్లతో గొడవకు యత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నేతల ఇంటి మీదకి వంశీ దాడికి వెళ్లారు. అక్కడకు కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో పోలీసుల సాయంతో వంశీ వెనుతిరిగారు. టీడీపీ నేత ఇంటిపైకి దాడికి వచ్చిన వంశీపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.