తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ గంభీర్ - కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై ఏమన్నారంటే? - Gautham Gambhir Visit in Tirumala - GAUTHAM GAMBHIR VISIT IN TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 3:10 PM IST
Former Cricketer Gambhir Reacts on Kohli and Rohit Retirement: భారత ప్రజలు గర్వించేలా టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వీఐపీ విరామ సమయంలో గంభీర్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై స్పందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పొట్టి క్రికెట్ రిటైర్మెంటుకు ముందు అద్భుత విజయం సాధించడంతో కోహ్లీ, రోహిత్ శర్మకు ఘనమైన వీడ్కోలు లభించిందన్నారు.
టీ20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్‌కు మంచి సందర్భం ఏం ఉంటుందని గంభీర్ అన్నారు. వన్డే, టెస్ట్‌లలో జట్టుకు వారిద్దరూ విలువైన సేవలు అందిస్తారని గంభీర్ తెలిపారు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 17ఏళ్లుగా టీమ్ఇండియాకు టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు అనేక విజయాలు అందించిన ఈ స్టార్ ప్లేయర్లు ఇకపై ఈ ఫార్మాట్లో కనిపించరు.