ఎమ్మెల్యే ద్వారంపూడి సముద్రగర్భాన్ని లూటీ చేస్తున్నాడు: మత్స్యకార జేఏసీ - MLA Dwarampudi Chandrasekhar Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 8:25 PM IST

Fishermen JAC anger against MLA Dwarampudi: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే అక్రమాలపై జేఏసీ నేతలు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో  మాట్లాడిన జేఏసీ నేతలు, ద్వారంపూడి దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకారంతో ద్వారంపూడి సముద్రగర్భాన్ని లూటీ చేస్తున్నాడని ఏపీ ఫిషర్ మెన్ జేఏసీ ఛైర్మన్ రాజశేఖర్ ఆరోపించారు. 

 కాకినాడలో 15 మత్స్యకార గ్రామాలు ఐదేళ్లుగా ఆందోళనలు చేపడుతున్నా నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని రాజశేఖర్ ఆరోపించారు. ఆయా గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఓఎన్‌జీసీని ముట్టడిస్తామని హెచ్చరించారు.  కాకినాడలో ఓఎన్‌జీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాల వలన మత్స్యసంపదకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. తద్వారా మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని వారికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం కలెక్టర్ కృతికాశుక్లాను కలిసిన జేఏసీ నేతలు, తమ సమస్యల పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.