పౌరసరఫరాల గోదాములో మంటలు- బియ్యం సంచులు అగ్నికి ఆహుతి - Fire in Civil Supply Ware House - FIRE IN CIVIL SUPPLY WARE HOUSE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 3:32 PM IST
Fire Accident in Civil Supply Ware House: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నంలోని పౌరసరఫరాల గోదాములో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని సివిల్ సప్లయ్ గిడ్డంగిలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగి బయటకు కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న వారు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు గోదాములో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బియ్యం బస్తాలను చాలా వరకు బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సుమారు 100 క్వింటాళ్ల వరకు బియ్యం సంచులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సెలవు రోజు కావడంతో గోదాములో కూలీలు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.
విషయం తెలుసుకున్న జేసీ అభిషేక్‌కుమార్, ఆర్‌డీఓ భాగ్యరేఖ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై చుట్టుపక్కల గ్రామస్థులతో ఆరా తీశారు. గోదాము మధ్య భాగంలో ఉన్న బియ్యం సంచులు మాత్రమే అగ్ని ప్రమాదానికి గురైయ్యాయి. ఈ ఘటన ఎలా జరిగిందో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఆకతాయిలు చేశారా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారేమో అన్న అంశాలపై పోలీసులు గ్రామస్థులను ఆరా తీశారు.