కుమార్తె ప్రేమ వివాహంతో తండ్రికి గుండెపోటు- చూపరులను కంటతడి పెట్టించిన దృశ్యాలు - Lovers Marriage Parents Upset - LOVERS MARRIAGE PARENTS UPSET
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 6:56 PM IST
Lovers Marriage Parents Upset: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవటంతో యువతి తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. అయితే తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి రావాలని కుమార్తెను తల్లి బాజీ ఎంతసేపు బతిమలాడినా రానని యువతి తెగేసి చెప్పింది. పైగా తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రియుడి వెంట వెళ్లిపోయింది. కనీ, పెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వ్యక్తితో కుమార్తె వెళ్లిపోవటంతో తల్లి బాజీ రోడ్డుపై పడి బోరున విలపించారు. ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి.
వివరాల్లోకి వెళ్తే: నీరుకొండకు చెందిన జస్వంత్, మంగళగిరి నగరానికి చెందిన జస్మిత ఇవాళ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మంగళగిరిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ మేజర్లు కావడంతో పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే జస్మిత తండ్రి రసూల్ పోలీస్ స్టేషన్కు వచ్చి తన కుమార్తెతో మాట్లాడారు. ఇంటికి వెళ్లి పోదాం రమ్మని బతిమాలాడారు. అయితే తాను రానని తెగేసి చెప్పడంతో స్వల్ప గుండెపోటుకి గురయ్యాడు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తండ్రిని చూసేందుకు రమ్మని తల్లి ఎంత బతిమాలినా రాకుండా ఆ యువతి ప్రియుడి వెంట కారులో వెళ్లిపోయింది.