కోర్టు బయటే రైతు ఆత్మహత్య - సోదరులతో ఆస్తి తగాదాలే కారణమా ? - Farmer Suicide Near Court
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 10:46 PM IST
Farmer Suicide Near Court : కోర్టు బయటే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలచివేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కోర్టు బయటే ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన కూచి వెంకటేశ్వర్లు (75), అతని సోదరులకు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది.
ఈ కేసు నందిగామ కోర్టులో వాయిదాలు నడుస్తుండగా, కేసు వాయిదాకి వచ్చిన వెంకటేశ్వర్లు తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తుండగా రైతు మృతి చెందాడు. రైతు వెంకటేశ్వర్లు చదువుకోలేదని, అనేక సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిప్పిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు ఆయన కోర్టుకు వచ్చినట్లు కూడా తమకు తెలియదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.