భూముల రీ సర్వేతో రైతులకు కొత్త చిక్కులు- రాత్రికి రాత్రే 60 సెంట్ల భూమి మాయం - Farmer Loss Three Acres
🎬 Watch Now: Feature Video
Farmer Loss Three Acres Land With Land Titling Act : మా ప్రభుత్వంలో భూములు సహా స్థిరాస్తులన్నింటికీ సర్వహక్కులు ఇస్తున్నాం. అసలైన యజమానులకే భూ హక్కులిస్తున్నాం ఇదీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ఊదర గొడుతోన్న మాటలు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జగన్ సర్కారు అమలు చేసే చట్టాల వల్ల ఓ రైతు తాను కష్టపడి కొన్న పొలాన్ని కోల్పోయారు. లక్షలు పోసి కొని ఇటీవలే తన పేరిట రిజిస్ట్రేషన్ సైతం చేసుకుని రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించుకున్నా భూమి మాయమైంది. తన పొలం భద్రంగా ఉందని ఎంతో ధీమాగా ఉన్న ఆ రైతుకు తెలియకుండానే రాత్రికి రాత్రే అధికారులు ఆయన పొలాన్ని ఇతరుల పేరుపై మార్చేశారు.
వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెదపులిపాకకు చెందిన రైతు ముసునూరు శ్రీధర్ 3 ఎకరాల 69 సెంట్ల పొలాన్ని కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే రీసర్వే తర్వాత 60 సెంట్ల భూమి మాయమైందని రైతు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కూడా తమ పేరిట లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని తమ భూములకు భద్రత ఎక్కడుందని రైతు ప్రశ్నిస్తున్నారు.