ఓటర్లపై మాజీ ఎమ్మెల్యే యరపతినేని హామీల వర్షం - యరపతినేని శ్రీనివాసరావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 10:29 PM IST

EX MLA Yarapathineni: గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన నియోజకవర్గంలోని ఓటర్లపై ఎన్నికల హామీల వర్షం కురిపించారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం అధికారంలోనికి వస్తే నియోజకవర్గంలో 15వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే మూడు సిలిండర్లతోపాటు అదనంగా మరో సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పాలనలో గురజాలలో బీసీలు అనేక అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక బీసీల గౌరవాన్ని పెంచే బాధ్యత తాను తీసుకుంటానని భరోసానిచ్చారు. 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు తెలిపారు. 

"ఈ నాలుగున్నర వైఎస్సార్​సీపీ కాంగ్రెస్​ పాలనలో బీసీలపై అనేక దాడులు జరిగాయి. అక్రమ మైనింగ్​ వల్ల మరణాలు సంభవించాయి.   మనకు ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. ఎక్కడైతే అవమానాలకు గురయ్యారో అక్కడే మీ గౌరవం నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తా." - యరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.