'పంచాయతీల నిధులను ప్రభుత్వం దారి మళ్లించింది - మంత్రి బుగ్గన చర్చకు సిద్ధమా?' - Panchayati Raj Chamber - PANCHAYATI RAJ CHAMBER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 26, 2024, 7:04 PM IST
Panchayati Raj Chamber Birru Pratap Reddy interview : వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీలు ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడాయి. ఎంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన సర్పంచ్లు చివరకు సొంత నిధులు వెచ్చించి, మరికొందరు ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు బీజేపీ సైతం మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉండగా పంచాయతీల అభివృద్ధిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చకు రావాలని పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం సవాల్ చేశాయి.
మే ఒకటో తేదీన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చకు రావాలని పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం సవాలు విసిరాయి. గ్రామ పంచాయతీలకు కేంద్ర విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించాయి. ఈ నిధులను విద్యుత్ బకాయిలకు చెల్లించామని మంత్రి బుగ్గన అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని ఆయా సంఘాల నేతలు ఆరోపించారు. 8,629 కోట్ల రూపాయల నిధులను ఏం చేశారో చెప్పాలని, చర్చకు బుగ్గన రావాలని చెబుతున్న పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.