LIVE: అయిదేళ్లుగా బాదుడే బాదుడు - మే 13న జనం ఏం చేయనున్నారు? - PRICES INCREASE IN ANDHRA PRADESH - PRICES INCREASE IN ANDHRA PRADESH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 9:30 AM IST
|Updated : May 10, 2024, 10:58 AM IST
PRICES INCREASE IN ANDHRA PRADESH: సీఎం జగన్ చెప్తున్న సంక్షేమం అంతా బూటకం, చూపిన ప్రేమంతా నాటకమేనా అంటే అవుననే అంటున్నారు ప్రజలు. అయిదేళ్లుగా జగన్ ఇచ్చిందెంత? ప్రజల్ని బాదింది ఎంత? 2019 నుంచి ఏం చేశారు? జనం బతుకులెలా భారమయ్యాయి? ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బాదుడే బాదుడని అంటూ రాగం అందుకున్న జగన్, ముఖ్యమంత్రిగా అయిదేళ్లలో అరివీరభయంకరంగా బాదుడు మొదలుపెట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్‌ను నిలిపారు. వరస విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై రూ. వేల కోట్ల భారాలు పడుతున్నాయి. ఇంటి పన్ను, చెత్తుపన్ను, మన్నుమషానమని ఆగమాగం చేస్తున్నారు. జగన్ పన్నుపీడనతో ఒక్కొక్క ఇంటిపై వేలల్లో ఆస్తిపన్ను పెరిగింది. ధరలు పెరిగి, ఉద్యోగ ఉపాధి లేక కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. పేద, మధ్యతరగతి నెలవారీ బడ్జెట్‌లు తలకిందులు అయ్యాయి. అయిదేళ్ల ప్రజలు ఎంతగానో బాధలు పడ్డారు. మరి జగన్ బాదుడుపై మే 13న జనం ఏం చేయనున్నారు? ఇదే అంశంపై నేటి డిబేట్.
Last Updated : May 10, 2024, 10:58 AM IST