కోల్డ్ స్టోరేజ్‌లో అగ్నిప్రమాదం- ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతు సంఘాల ఆందోళన - Cold storage fire hazard in guntur
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:38 PM IST
Duggirala Cold Storage Fire Accident Turmeric Farmers Protest: మంచి ధర వస్తుందని, ఆ ధరకు అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయని ఆశపడిన రైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేసిన లక్షా 15 వేల బస్తాల పసుపు అగ్నికి ఆహుతి అవ్వటంతో రైతుల కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన జరిగి 24 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటంతో పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎంత మంది రైతులకు నష్టం జరిగింది, ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో అంచనా వేయకపోవటంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల నిధి లేదా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Farmers Demand to Give market Price: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో గత నెల 19న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవటంతో గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘాలు ఆందోళన చేశారు. 6 జిల్లాలకు చెందిన బాధితులు ఆందోళనలో పాల్గొన్నారు. లక్షా 15 వేల బస్తాల పసుపు అగ్నికి ఆహుతైందని, 11 మంది సభ్యుల కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో ఇప్పటి వరకూ వెల్లడించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి ధర వస్తుందని ఏళ్ల తరబడి అద్దె కట్టి స్టోరేజ్‌లో ఉంచితే నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల పంట పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోయారు.