తాడేపల్లి కాంప్లెక్స్‌లో రౌడీలందరితో సజ్జల సమావేశం : డొక్కా - Dokka comments on Sajjala - DOKKA COMMENTS ON SAJJALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 3:49 PM IST
Dokka Manikya Varaprasad Comments on Sajjala : రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. తాడేపల్లిలో రౌడీలందరితో సమావేశం నిర్వహించిన సజ్జల అందుకు సంబంధించి సూచనలు చేశారన్నారు. పోలీసులు విచారణ జరిపించి సజ్జలపై చర్యలు తీసుకోవాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. రాజధాని ప్రాంతంలోని ఐకానిక్ టవర్ల ప్రాంతంలో ఆయన పర్యటించారు. కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటి తాడేపల్లి ప్యాలెస్‌లో డాన్లందరిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టారని అన్నారు. కాంప్లెక్స్‌లో కమాండర్లా సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు, కుతంత్రాలకు ప్రణాళికలు రచించారని చెప్పారు. జగన్ కాంప్లెక్స్‌లో సుప్రీం లాంటివారని ఆయన అభివర్ణించారు. సుప్రీం కన్నా కనపడని శక్తి ప్యాలెస్‌లో ఉందని ఆశక్తి ఆదేశాలతోనే కుట్రలు, కుతంత్రాలు అమలవుతున్నాయని అన్నారు. చట్టాలని పాటించని వీరు కూటమి నేతలు చట్టాలు అనుసరించడం లేదు అని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ఇకనైనా వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని డొక్కా అన్నారు.