కారులో దర్జాగా వస్తారు - లారీలలో డీజిల్​ ఎత్తుకెళ్తారు - Diesel Theft At Rompicherla HighWay

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 1:37 PM IST

thumbnail
హైవేలో డీజిల్​ దొంగతనాలు- రెచ్చిపోతున్న ముఠాలు (ETV Bharat)

Diesel Thieves  At Rompicherla HighWay in Palnadu District : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో ఆయిల్ చోరీ ముఠా ఆగడాలు సృష్టిస్తున్నారు. కారులో దర్జాగా వచ్చి ఆగివున్న లారీలలో అర్ధరాత్రి డీజిల్ దొంగతనం చేస్తున్నారు. అద్దంకి నుంచి నార్కెట్ పల్లి హైవేపై రొంపిచర్ల పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి చోరీల సంఖ్య పెరిగిపోతుందని స్థానికులు తెలుపుతున్నారు. లారీ డ్రైవర్లు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి లారీల నుంచి డీజిల్​ని కొందరు నిందితులు దొంగిలిస్తున్నట్లు డ్రైవర్లు పేర్కొన్నారు. తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతుండటంతో లారీ డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. దగ్గర్లోని పెట్రోల్​బంక్​ వద్ద ఆయిల్ చోరీ ముఠా కదలికలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. రొంపిచర్ల పోలీసులు ఆయిల్ చోరీలపై దృష్టి సారించి నింధితులను పట్టుకుని చోరీలను అరికట్టాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. తరచూ జరుగుతున్న దొంగతనాలలో కొన్ని సార్లు వారి ఫోన్లను సైతం దుండగుక ఎత్తుకుపోతున్నారని బాధితులు వాపోతున్నారు. జాతీయ రహదారులపై అర్థరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా భారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.