పింఛన్లు పంచటానికి 10 రోజులు సమయం కావాలా?: ధూళిపాళ్ల - Dhulipalla Narendra Comment - DHULIPALLA NARENDRA COMMENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 10:21 AM IST
Dhulipalla Narendra Kumar Comment Pension Distribution On CS Jawahar Reddy : రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంచడానికి లక్షా 65 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చాలరా అని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మండిపడ్డారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి 40 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంచటానికి 10 రోజులు సమయం కావాలా? అని సీఎస్ జవహర్‌రెడ్డిని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేలా ఆదేశాలివ్వాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చినందున సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వాలని ధూళిపాళ్ల నరేంద్ర ఎలక్షన్ కమిషనర్‌ను ఓ ప్రకటనలో కోరారు. పింఛన్ పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.