ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల కలబోత - సందడిగా చార్ధామ్ యాత్ర - Chardham Yatra - CHARDHAM YATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 4:59 PM IST
DEVOTEES TO KEDARNATH TEMPLE : ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ప్రకతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది కేదార్నాథ్ యాత్ర. దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు శిఖరాల అందాలు కట్టిపడేస్తున్న నేపథ్యంలో యాత్రికుల సంఖ్య పెరిగిపోయింది. కేదార్నాథ్ చేరుకోవాలనుకునే భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారిని మాత్రమే ఆలయ పరిసరాల్లోకి అధికారులు అనుమతిస్తున్నారు. ఎత్తైన కొండలు, పాలనురగల్లాంటి జలపాతాలు, చుట్టూ మంచుకొండలు ప్రకృతి ప్రేమికుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు, ప్రకృతి ప్రేమికులు కేదారనాథుడి దర్శనానికి బారులు తీరుతున్నారు. ప్రస్తుతం చార్ ధాం యాత్రలో ప్రధానమైన కేదార్ నాథ్ ధాం కి యాత్రికులు పోటెత్తుతున్నారు, దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు శిఖరాల అందాలు యాత్రికులను కట్టిపడేస్తున్నాయి, కేదార్ ధాం కి వచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుపడలేదని యాత్రికులు చెబుతున్నారు. మరింత సమాచారం కేదార్నాథ్ ఆలయం నుంచి మా ప్రతినిధి మహేశ్ అందిస్తారు.