వజ్ర కిరీటధారిణిగా భక్తులకు దర్శనమిచ్చిన అన్నవరం అనంతలక్ష్మి అమ్మవారు - Diamond Crown to Annavaram Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 11:39 AM IST

Devotee Donates Diamond Crown to Annavaram Anantha Lakshmi Ammavaru : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవేరి అనంత లక్ష్మీ అమ్మవారు వజ్ర కిరీటధారిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ లలిత ఎంటర్​ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మట్టే సత్య ప్రసాద్, సూర్య కమల దంపతులు సుమారు కోటిన్నర రూపాయలోతో వజ్ర కిరీటం తయారు చేయించారు. అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వేదమంత్రోచ్ఛరణ నడుమ అందించారు. స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణలు కూడా చేయించారు.

Diamond Crown to Annavaram Temple : సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేదిక సందర్భంగా తెల్లవారుజామున దాత కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలో వైదిక బృందం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం అనంతరం అమ్మవారికి వజ్ర కిరీటాన్ని అర్చకులు అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మట్టే సత్య ప్రసాద్, సూర్య కమల దంపతులు రెండేళ్ల కిందట సత్యదేవునికి వజ్రకిరీటం తయారు చేయించగా తాజాగా అమ్మవారికీ వజ్రకిరీటం అందిచారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.