కృష్ణా నదిలో ప్రమాదకర స్థాయిలో పడవల ప్రయాణం - అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం - mahashivratri celebrations 2024
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 2:59 PM IST
Dangerous Boat Journey on Krishna River: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ముక్త్యాల వద్ద కృష్ణా నదిలో ప్రమాదకర స్థాయిలో పడవల ప్రయాణం సాగిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని(mahashivratri celebrations in AP) పురస్కరించుకొని లక్షలాదిమంది భక్తులు ముక్త్యాల క్షేత్రానికి తరలివచ్చారు. కృష్ణానది పుష్కర ఘాట్ (Krishna River Pushkara Ghat)లో నదీ స్నానాలు ఆచరించేందుకు జనం పోటెత్తారు. ఘాట్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు అవతల వైపు ఉన్న మాదిపాడు ఒడ్డుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఇదే అదునుగా కొందరు పడవలు ఏర్పాటు చేసి, ఛార్జీల పేరిట భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. పడవలో పరిమితికి మించి జనాల్ని ఎక్కించి వృద్ధులు, చిన్నారులు, మహిళలను ప్రమాదకరంగా ఒడ్డుకు చేరవేస్తున్నారు. లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా ప్రమాదకర స్థితిలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంపై భక్తులు సైతం పడవల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవ ఏర్పాట్లు పరిరక్షించిన అధికారులు కృష్ణానదిలో భక్తుల భద్రతను మాత్రం గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.